Categories
పిల్లలకు ఆరునెలలు దాటాకా ఘనాహారం ఇవ్వాలి. పాలు తాగే పిల్లలను ఈ ఘనాహారానికి అలవాటు చేయటాన్నీ వీనింగ్ అంటారు. తల్లి పాలతో పాటు అన్నం,గోధుమల వంటి గింజ ధాన్యాలు ,ఆఫిల్ ,సపోటా పళ్ళు, పప్పు ధాన్యాలు కూరలలో క్యారెట్స్ బాగా ఉడికించిన దుంపలు వంటివి పిల్లలకు ఇవ్వవచ్చు .వాళ్ళకు మంచి నీళ్ళుతాగించాలి. పిల్లలకు ఇంట్లో ఆహారం తయారు చేయటం కుదకరపోతేనే రెడీమెడ్ సిరీయల్ బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి. పండ్లు తినిపించవచ్చు కానీ జ్యూస్ ఇవ్వటం మంచిది కాదు .పిల్లల వయసు చిన్నది కనుక తినేందుకు ఇష్టపడతారు కానీ తల్లులకు ఇప్పుడే ఓర్పు చాలా అవసరం.