Categories
సంపూర్ణ పోషకాలలో భాగం మజ్జిగ. ఆహారంలో మజ్జిగ ఒక భాగంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోన్నట్లు. దేవతలకు అమృతం ఎలాగో మనుషులకు మజ్జిగ అంత అంటుంది ఆయుర్వేదం. మజ్జిగను పాలు కాచి ,తోడుపెట్టి పెరుగుగా మార్చి దాన్ని చిలగ్గొట్టి మజ్జిగ చేస్తారు. పెరుగు చిలికే క్రమంలో నీళ్ళు చేరుస్తూ పైకి తెలిన వెన్నను తొలగిస్తే మంచి మజ్జిగ తయారవుతుంది. ఈ మజ్జిగ జీర్ణక్రియను ఉద్దీపిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. చక్కెర స్థాయిలు తగ్గతాయి. బరువు తగ్గించటంలో సాయం చేస్తుంది.రుచిగా కావాలంటే శొంఠి పొడి ,నిమ్మరసం,ఉప్పు మొదలైనవన్ని కలుపుకోవచ్చు.