ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు లగేస్తుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి అంటున్నాయి అధ్యాయినాలు. చల్లగా తాగే కూల్ డ్రింక్స్ అప్పటికప్పుడు దాహం తీరుస్తాయి కానీ ముందు ముందు ప్రమాదాలు తప్పవు. వీటిలో అధికంగా వుండే చెక్కర, ప్రిజర్వేటివ్ లు ఇతర రసాయినాలు బరువును పెంచడం తో పాటు ఇతరాత్రా రోగాలకు దారి  తీస్తాయని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్త వయస్సులో మహిళలు దీర్ఘకాలం కడుపు మంట, అల్సర్ల తో బాధపడితే రొమ్ము కాన్సర్ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్లనే ఆహారపు అలవాట్లలో శ్రద్దగా వుండాలని సహజంగా దొరికే ఏ కొబ్బరి నీల్లో, లేదా మంచి నీల్ల తో తీరే దాహం సీతాల పానీయాల వరకు వెళ్ళనివ్వోదని హెచ్చరిస్తున్నారు.

Leave a comment