స్టార్ ఫ్రూట్స్ తియ్యని ,పుల్లని రుచితో ఉంటుంది. ఇండోనేషియా ,ఫిలిప్పిన్స్ ,మలేషియా ,నేపాల్ ,ఇండియా ,బంగ్లాదేశ్ ,శ్రీలంకలో పండుతాయి . సాధారణంగా ఐదు ముభాలతో ఉండే ఈ స్టార్ ష్రూట్స్ ముక్కలుగా కోస్తే అచ్చంగా స్టార్ ఆకారంలో వస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. చింత పండుకి బదులుగా వాడతారు కూడా. వంద గ్రాముల పండ్లలో కేవలం 30 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఎ,బి,సి, విటమిన్లతో పాటు బి9 అన్ని రకాల ఖనిజాలు ఈ పండులో ఉంటాయి. గొంతుకు సంబంధించిన చిన్న అనారోగ్యాలకు ,అల్సర్లకు ఎంతో మంచిది. జీర్ణశక్తిని పెంచుతాయి. మధుమేహాన్ని నివారిస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్దాప్యాన్ని దగ్గరకు రానివ్వదు. ఈ పండ్లగుజ్జుని ముఖానికి పూసి కాసేసు ఆగి కడిగేస్తే చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది.
Categories