ఇలియానా తాజా చిత్రం ముబారక్ లో ‘హవా హవా’ పాటను ఆన్ లైన్  లో రెండు కోట్ల యాబై లక్షల మందికి పైగా చూశారు. ఈ మద్య కాలంలో బర్ఫీ తరువాత ఇలియానా దాదాపు హిందీ సినిమల్లోనే నటించింది. హైదరాబాద్ ను, టాలీవుడ్ ను ఎంత మిస్సవుతున్నానని చెప్పే ఇలియానా వీలైనంత త్వరగా వెనక్కి వచ్చేస్తానంటుంది. షూటింగ్ లో ఉంటె అన్ని పనులు ఎవరో ఒకళ్ళు చేసి పెట్టేస్తారు. ఇక లేనప్పుడు కుకింగ్, క్లీనింగ్ కూడా నేనే చేస్తాను. టీవీ చూస్తూనే కాలక్షేపం చేస్తాను. ఇప్పుడు బాలీవుడ్ విషయానికి వస్తే అన్ని ఇద్దరు హీరోయిన్ల చిత్రాలే. అందరితో స్నేహంగా ఉండటం కష్టమే. మైన్ తేరా హీరో సినిమాలో నాతో నటించిన నర్గీస్ ఫక్రీ నాతో బావుటుంది. కానీ మిగతా హీరోయిన్ల కు  గ్రీట్ చేస్తాను కాని పెద్దగా క్లోజ్ గా మూవ్ అవ్వలేను. ఇక ఇక్కడ అందమైన హీరోయిన్లు కాజోల్, దీపిక పడుకొనే, ఆలియాభట్ చాలా అందమైన వాళ్ళు అంటూ బాలీవుడ్ ముచ్చట్లు చెప్తోంది ఇలియానా.

Leave a comment