Categories
సంవత్సరంలోపు పిల్లలకు వట్టి పాలు సరిపోవు కాబట్టి ఘనాహారం అలవాటు చేయాలి. పళ్ళు వచ్చే వయసు కూడా .ఆరు నెలల నుంచి అలవాటు చేస్తే సంవత్సరం వచ్చే సరికి ఈ ఆహారం తినేందుకు వాళ్ళు సిద్దంగా ఉంటారు. ఆహారం పిల్లలకు అరిగే లాగా బాగా మెత్తగా ఉడికించి ఇవ్వాలి.వండిన కూరగాయలు ,కందిపప్పు ,పెసర పప్పులు కూడా రవ్వలాగా చేసి అన్నంతో కలిపి అందులో చక్కగా నెయ్యి వేసి తినిపించవచ్చు. మాంసాహారం అలవాటు చేయదలుచుకుంటే చికెన్ ,చేప పెట్టవచ్చు. ఉడికించిన కోడిగుడ్డు పచ్చపొనలో చిన్న భాగం పెట్టినా అరుగుతుంది. తియ్యని స్వీట్లు పంచదారా వంటివి కాకుండా అన్ని రకాల పండ్లు ఏవైనా తినిపించవచ్చు . ఇంట్లో వండుకొనే అన్ని రకాల ఆహారపదార్థాలు వాళ్లకు అలవాటు చేయాలి.