ఫ్యాషన్ ట్రెండ్ విషయంలో తమన్నా చాలా పర్టిక్యులర్. బాలీవుడ్ ఫ్యాషన్ కు దక్షిణాది ఫ్యాషన్ కు బోలెడంత తేడా వుంది. అక్కడి ఫ్యాషన్ హంగామా పక్కన పెడితే మనకు సౌందర్యంగా వుండేవీ, ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చేదీ అసలైన ఫ్యాషన్. ప్రత్యేక ఫ్యాషన్ అనండి, సినిమాలో వేటిపైనా నా ఇష్టాఇష్టాలు సినిమా విషయంలో మాత్రం డైరెక్టర్ దే. ఏ పాత్రకు సరిపోతానో, ఎలా చేస్తే బావుంటుందో దర్శకులు నిర్ణయిస్తే, ప్రేక్షకులు వాటికి మార్కులు వేస్తారు. వాటినే నమ్ముతానంటుంది తమన్నా. ఇప్పటివరకు గ్లామర్ ప్రాధాన్యత ఉన్నవీ, నటనకు ప్రాధాన్యత ఉన్న రెండు రకాల పాత్రలకు న్యాయం చేయగలనని నమ్మిన నా దర్శకులు నా కోసం మంచి పాత్రలు సృష్టించి ఇచ్చారు. మెచ్చిన ప్రేక్షకులకు, దర్శకులకు రుణపడి వుంటాను. నా చుట్టూ వున్నా వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే నేను ఆ భాషలో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాను కనుకనే తెలుగు, తమిళం నేర్చుకోగలిగాను అంటోంది తమన్నా. ఈ పరిశ్రమలోకి నటించడం కోసమే వచ్చాను అందుకే నా ఆలోచనలు, సమయం అన్నీ ఈ పరిశ్రమకే ఇచ్చేశానంటోంది తమన్నా. వృత్తి పట్ల ఇంత నిబద్ధత వుంది కనుకనే ఆమె నెంబర్ వన్ రేస్ లో వుంది.
Categories