ఈ సంవత్సరం తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామిగా  నిలిచింది బండ్ల శిరీష. ఇండియన్ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజనీర్ వర్జిన్ గెలాక్టిక్ అధినేత తో కలిసి అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి తెలుగు అమ్మాయి. గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష తల్లిదండ్రులతో అమెరికాలోని  హ్యూస్టన్ వెళ్లి అక్కడే చదువు పూర్తి చేసింది. 2015 లో వర్జిన్ గెలాక్టిక్ లో చేరి అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శిరీష వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ లో ఆరుగురు సభ్యుల బృందంతో కలిసి అంతరిక్ష యాత్ర పూర్తి చేసింది. శిరీష ఫెడరల్ ఏ విషయన్ అథారిటీ స్పేస్ టూరిస్ట్ జాబితాలో చేరారు.

Leave a comment