తోడబుట్టిన వాళ్ళ మధ్యన చిన్న తగువులు రావటం సహజం ఇప్పుడు పూర్తి సమయం ఇంట్లోనే ఉండటం వల్ల ఇవి మరికాస్త ఎక్కువ కావచ్చు.ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు చదువుకునేవాళ్ళు ఇంకొకళ్ళు మరీ చిన్న వాళ్ళు ఉండవచ్చు. ఒకళ్ళు ఆడుతూ ఉంటే పెద్ద పిల్లలకు చదువు కు అంతరాయం కలగవచ్చు. ఈ విషయాన్ని పెద్ద వాళ్ళు గ్రహించి త్వరగా పనులు ముగించుకుని చిన్నపిల్లలను చదువుకునే పిల్లలకు దూరంగా తీసుకుపోవాలి. ఆన్ లైన్ క్లాసులు అసలే కొత్త అందుకే సాధ్యమైనంత ప్రశాంతంగా వాళ్ళను చదువుకొనివ్వాలి. అలాగే మరీ క్రమశిక్షణ వద్దు పిల్లలను దండించే పని పెట్టుకోవద్దు ఇద్దరికీ ఆడుకునే వస్తువులు సమానంగా ఇవ్వాలి.ఒకళ్ళవి ఒకళ్ళు తీసుకోవాలి అనుకుంటే ముందుగా అనుమతి తీసుకోమని నేర్పాలి.తినే వస్తువులు సమానంగా ఇవ్వాలి.ఈ లాక్ డౌన్ సమయం, పిల్లలు కొత్తగా ఇంట్లోంచే చదువుకునే పరిస్థితి వచ్చిన సమయాన్ని అర్థం చేసుకొని పెద్దవాళ్ళు పిల్లలకు అన్ని రకాల పరిస్థితులు వివరంగా చెప్పి వారికి ఒత్తిడి కలగకుండా చేయాలి.
Categories