నిరుపేద కుటుంబానికి చెందిన దులారీ దేవి బీహార్ లోని మిథిలా ప్రాంతంలో పుట్టింది. మధుబాని కళాకారిణి మహా సుందరి ఇంట్లో పనిమనిషి గా పని చేస్తూ ఆవిడ ప్రోత్సాహంతో మధుబాని పెయింటింగ్ నేర్చుకుంది. లైన్ స్కెచింగ్, రంగులు నింపడం లో ప్రత్యేక శైలికి అలవర్చుకున్నారు. సాంప్రదాయ మిథిలా కళకు మోడల్స్ థీమ్స్ ను కలిపి కొత్త డిజైన్లు సృష్టిస్తుంది. పదివేలకు పైగా చిత్రాలు వేశారు. 50కి పైగా ఎగ్జిబిషన్ లు నిర్వహించారు. 2021 లో భారత ప్రభుత్వం దులారీ దేవి పద్మశ్రీ పురస్కారం అందించింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక చీర నేసి ఇచ్చింది ఈ కళకారిణే.

Leave a comment