ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ పనైనా తేలికే. ఒక్కసారి ఎలాంటి అవసరం ఉన్నా అంతర్జాలం లోకి తొంగిచూస్తే చాలు . వెంటనే సమాధానం దొరికిపోతుంది. నెలనెలా జిమ్ కి వెళితే తీరైన శరీరం సాధించవచ్చు. నిజమే. మరి ఉన్న బడ్జెట్ లో అన్నీ సాధ్యమౌతాయా ? కష్టమే . ఇప్పుడు చాలా చౌకగా దొరికే కొన్ని వస్తువులతో వ్యాయామం జిమ్ కంటే బాగా చేయచ్చు. జంప్ రోప్. ఇది తాడాట. భుజాలు తొడలు కాలికండరాలకు సరైన వ్యాయామం అందుతుంది. అలాగే రెసిస్టెంట్ బ్యాండ్స్ కొన్ని రకాల వ్యాయామాలకు శరీరం అంత తేలికగా ఎటు పడితే వంగి సహకరించదు. అలాంటప్పుడు రెసిస్టెంట్ బ్యాండ్లు ఉపయోగపడతాయి. ఒక తాడు దాన్ని పట్టుకునే పరికరం ఉంటుంది. దీని సాయంతో కష్టమైన స్ట్రెచెస్ ని వ్యాయామాలనీ చాలా సులభంగా చేసుకోవచ్చు. అలాగే డంబెల్స్. మహిళలు ఒక్క కేజీ బరువున్న డంబెల్స్ ఎంచుకుంటే చాలాతేలికగా ఉంటుంది. వీటితో జిమ్ మాదిరి వ్యాయామం ఇంట్లోంచే చేయవచ్చు.
Categories
WhatsApp

వీటితో అచ్ఛం జిమ్ కి వెళ్లనట్లే

Leave a comment