చేతినిండా అందమైన గాజులు ఎప్పుడూ బావుంటాయి కానీ డ్రెస్ కు సరైన గాజుల ఎంపిక ముఖ్యం. లెహంగా ధరిస్తే మెటల్ లేదా డైమండ్ బ్యాంగిల్స్ బావుంటాయి. పెళ్లికూతురి ముస్తాబు లో చూడా, కలిరే గాజులు బ్రైడల్ కు బెస్ట్ ఆప్షన్. ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్ లా ఉన్న గౌను ధరిస్తే థ్రెడ్ బ్యాంగిల్స్ ఈ రోజుల్లో ట్రెండీగా ఉంటాయి. అనార్కలి వంటి పాపులర్ డ్రెస్ కు ముత్యాల గాజులు వేసుకోవచ్చు. చీర మీదకు గ్లాస్ బ్యాంగిల్స్ చక్కగా నప్పుతాయి. ప్రత్యేక శుభకార్యాల్లో డైమండ్ బ్యాంగిల్స్ బావుంటాయి. స్కర్ట్ క్రాప్ టాప్ వంటి వెస్ట్రన్ అవుట్ ఫిట్ కు ముత్యాల బ్యాంగిల్స్ సూట్ అవుతాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ తోనూ చక్కని లుక్ వస్తుంది.

Leave a comment