నీహారికా,

కొన్ని పనులు అనాలోచితంగా చేస్తూ వుంటాం. ముఖ్యంగా పిల్లలున్న ఇల్లు వాళ్ళ అల్లరి మన్పించడం కోసం పిల్లకు సెల్ ఫోన్ లేదా టాబ్లెట్ ఇచ్చేస్తాం. వాళ్ళు దాన్ని చూడటం లో మునిగి నిశబ్ధంగా ఉండిపోతున్నారు. నిజమే కానీ ఒక పరిశోధనలో చిన్న పిల్లలు రోజుకు రెండు గంటల 19 నిమిషాలు స్క్రీన్ టైమ్ గడుపుతున్నారని తెలింది. ఇది కేవలం మొబైల్స్ చూస్తూనే గడుపుతున్న పిల్లల్ని కొన్ని లక్షల మంది పై జరిపిన ఒక సర్వే రిపోర్టు రిజల్ట్ పిల్లల ఈ అలవాటు మళ్ళించడం పెద్దలకు కష్టమే. కళ్ళను ఆకర్షించే రంగులతో అలవాటవ్వుతున్న గేమ్స్ ను పిల్లలు వదలరు. కానీ ఆ ఏకాగ్ర వేరే విషయాల మీదకి మల్లిన్చాకపోతే చాలా నష్టం అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధకులు. వాళ్ళకు దృశ్య రూపంలోనే స్క్రీన్ టైమ్ పరిధిని అర్ధం అయ్యే లాగా చెప్పుతుంది. పిల్లలిని అందరితో కలిసి భోజనానికి కూర్చో బెట్టడం, వాళ్ళని సాయంత్రం వేళ స్వయంగా దగ్గరుండి ఆడించడం, వాళ్ళతో కొన్ని గంటలు గడపడం చాలా అవసరం అంటుంది. పిల్లని కన్నాక వాళ్ళ కోసం వాల్యూబుల్ టైమ్ తప్పని సరిగా ఖర్చు చేయాలి. ఈ విషయం తల్లిదండ్రులు తెలుసుకోవాలి అంటున్నాయి అద్యాయినాలు.

Leave a comment