జుట్టు వుంటే  ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ  వుండాలే కానీ సంప్రదాయ  పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు దురద సమస్యలు కూడా పోయి జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది. గుడ్డు తెల్ల సొనలు తగినంత పెరుగు కలిపి కుదుళ్లకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది. వేపాకులు నీళ్లలో మరిగించి ఆ నీళ్లతో స్నానం చేయటం మంచిదే. వారంలో మూడు రోజులు కొబ్బరి ఆలివ్ నూనెలతో తలకు మస్సాజ్ చేసుకుని తలస్నానం చేస్తే పట్టులాంటి జుట్టు సొంతం చేసుకోవచ్చు .

 

Leave a comment