ఇప్పడూ ఇవి మన దేశపు పండ్లు. హైద్రాబాద్ అనాబ్ షావీలు , నూజివీడు మామిడికాయలు అంటూ మురిసిపోవటానికి ఏవీ లేదు. దేశ విదేశాల పండ్లు మన పండ్ల మార్కెట్ లో ప్రత్యక్షమై అవే  మన పండ్లనీ అంత రుచికరమైనవి తినకపోతే జన్మ సార్ధకంకాదనీ అనిపించేస్తూన్నాయి. ఒకప్పుడు న్యూజిలాండ్ లో మాత్రమే పండే కివి పండు ఇప్పుడు మార్కెట్ లో ఎటు చూసినా కనిపిస్తాయి. కమలాలకు రెట్టింపుగా విటమిన్ సి ఆపిల్ లో కన్నా ఐదు రెట్లు ఎక్కువ పోషకాలు దీని సొంతం పీచు పదార్ధం విటమిన్ ఇ  పొటాషియం కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం ఈ కివీ పండు. కొవ్వులా సోడియం తక్కువగా ఉండటం వల్ల  హృద్రోగులు మధుమేహం వ్యాధి వున్నవాళ్లు దేన్నీ హాయిగా తినవచ్చని వైద్యుల సలహా . బరువు తగ్గించుకోవాలంటే ఇది మంచి నేస్తం. దేనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల  బీపీ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు నోరూరించే రుచితో కివి పండు పై చేయిగానే ఉంటుంది.

 

 

Leave a comment