నిద్రలేవగానే నేనేంటి అని ప్రశ్నించుకోంటా దానికి సమాధానం కూడా ఎవరికీ వారు అన్వేషిమ్చుకోవల్సిందే అంటోంది తమన్నా. సినీ గ్లామర్ ప్రపంచంలో మెరుపులు మెరిసే తమన్నా దృక్పదం మాత్రం వేరు. ఆమె జీవితాన్ని చూసే కోణం వేరు. చిన్న వయస్సులోనే చిత్ర పరిశ్రమ లోకి వచ్చిన తమన్నాకు అక్కడి తీరు తెన్నులు తెలుసు ప్రణాళిక ప్రకారం ఎదీ జరగదని అనుకోకుండా జరిగే అద్భుతాలే ఎక్కువంటుంది తమన్నా. అన్ని పరిస్ధితులను తట్టుకొనే కెరీర్ మలుచుకున్నాను. ఇప్పటి దాకా సాగిన ప్రయాణం నాకు చాలా ఇష్టం. వాణిజ్య చిత్రాల్లో నేను నటించిన దాన్ని నేను తక్కువ చేయడం లేదు. ప్రేక్షకులను ఎలా మెప్పించగలనో ఆలోచిస్తాను. అది వాణిజ్య చిత్రమైనా, నటనకు ప్రాధాన్యత వున్న సినిమా అయినా ప్రతి సంనివేసంలోను అత్యుత్తమ ప్రతిభను ప్రదరశించ వలసి వుంటుంది. అసలు తమన్నా అంటేనే కళాకారిణి. ఒక యాక్టర్ అంటోంది తమన్నా.
Categories