విషతుల్యమైన ఆర్సెనిక్ ప్రభావాన్ని మొట్టమొదటగా అంచనా వేసి ప్రపంచానికి తెలియ జెప్పిన జీవకణ శాస్త్రవేత్త అర్చనా శర్మ . పుణె లో జన్మించిన అర్చన రాజస్థాన్ ,కోల్ కతా లో విద్యనభ్యసించారు . దేశంలో డాక్టర్ ఆఫ్ సైన్స్ బిరుదు పొందిన రెండో భారతీయ మహిళ అర్చన . కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేసి ఆ తరువాత 1983 లో యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి అద్యక్షులయ్యారు . యూజీ సీ లో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ డిపార్టుమెంటు ఆఫ్ బయోటెక్నాలజీ ,టాస్క్ ఫోర్స్ చైర్ పర్సన్ గా సేవలందించారు . ఎన్నో పరిశోధన వ్యాసాలు సమర్పించారు .