Categories
టి.వి చూస్తూ నెట్ లో కాలక్షేపం చేస్తూ అర్ధరాత్రి వరకు మేలుకోవటం చాలా మందికి అలవాటై పోయింది. అలాగే అర్ధరాత్రి అయినా ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళటం ఏదో ఒక చిరుతిండి తిటనం కూడా అలవాటుగా మారుతోంది. ఈ అర్ధరాత్రి తిండ్లు స్థూలకాయం ,కార్డియో మెటబాలిక్ వ్యాధులకు అవకాశం ఇస్తాయి. అలాగే పోషకాలు లేని ఆహారం తక్కువ ప్రోటీన్స్ గల పదార్ధాలు తినటం కూడా రాత్రి వేళ చిరుతిండ్లపైకి మనసు పోయోలా చేస్తుంది. ఈ తిండి బ్లడ్ షుగర్ స్థాయిని పెంచి అధిక బరువు ,యాసిడ్ రొఫ్లైక్స్ కు కారణం అవుతుంది. ఇలాంటి తిండి అదుపు చేయాలంటే పగటి వేళ ,సమతులాహారం తీసుకోంటూ తాజా కూరలు, నట్స్ గింజలు తినాలి. ముందుగా వేళకు నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి.