ఆకాశాన్నంటే పరమేశ్వరుడి విగ్రహాన్ని చూడాలంటే చార్ ధామ్ కు వెళ్ళాలి.సిక్కిం లోని నామ్చి సోలో ఫోక్ కొండపై కనిపించే ఈ ఆధ్యాత్మిక ధామాన్ని ప్రభుత్వం నిర్మించింది. 108 అడుగుల ఎత్తున శివుడి విగ్రహం ఎదురుగా నంది స్వామి చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఉండడం ప్రత్యేక ఆకర్షణ. మెట్లకు ఇరువైపులా రామేశ్వరం బద్రీనాథ్ పూరీ జగన్నాథ్ ద్వారకా తాలూకూ ఆలయాల నమూనాలు దర్శించుకోవచ్చు. అందమైన నిర్మాణశైలిలో ఈ సిద్దేశ్వర ధామ్ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Leave a comment