Categories
శరీరానికి సరిపోయినన్ని నీళ్ళు తాగక పోవటం వల్లనే మహిళల్లో యూరినల్ ట్రాక్ ఇన్ ఫెక్షన్ల వంటివి వస్తున్నాయి అంటున్నాయి అధ్యయనాలు . ఇంటి పనుల్లో తల మునకలయ్యే మహిళల్లో 90 శాతం మంది మంచి నీళ్ళు తాగటం మరిచిపోతారు . డీ హైడ్రేషన్,తలనొప్పి అలసట వంటి సమస్యలు నీళ్ళు సరిగ్గా సరిపోకనే వస్తాయి . గంటకో సారి మోగేలా అలారం సెట్ చేసుకొని మంచినీళ్ళు తాగమంటున్నారు డాక్టర్లు . కేరళ ,కర్ణాటక,చెన్నయ్ రాష్టాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు మరచిపోకుండా నీళ్ళు తాగేందుకు గాను ప్రత్యేకంగా గంటకోసారి గంట మోగించే ఏర్పాట్లు చేస్తున్నారు . అదే పద్ధతి మహిళలు కూడా పాటించమంటున్నారు ఎక్స్ పర్డ్స్ .