Categories
Wahrevaa

ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలున్న జామ.

అతి చౌకలో అందరికీ అందుబాటులో వుండే జామపండులో అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, ఔషధ ప్రయోజనాలు వున్నాయి. జామ కాయిలు చర్మం టెక్టర్ ను మెరుగు పరుస్తాయి. అత్యంత నాణ్యమైన సౌందర్య క్రీములు లేదా స్కిన్ టోనడ్ జెల్స్ ఇవ్వలేని సునితమైన అందమైన చర్మాన్ని జామకాయ ఇవ్వగలుగుతుంది. జామ పండుతినడం వల్ల, జామ పిందెలు, ఆకులూ వేసి మరగకాచిన డికాషన్ తో చర్మాన్ని కడుక్కోవడం వల్ల చర్మానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కండరాలుబిగుతుగా అయ్యేలాగా చేయగలదు. ఇవన్నీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్, డిటాక్సిఫయిర్లు కాగా చర్మానికి మెరుపులు ఇస్తాయి. ముందుగా వార్ధక్వ లక్షణాల నుంచి ముడతలు ఇతర చర్మ సంబందిత రుగ్మత నుంచి పరిరక్షిస్తాయి. ప్రోటీన్లు, విటమిన్లు, పిఇచు తీసుకునే విషయంలో, బరువు తగ్గాలనుకునే వారికి జామపండు ఎంతో సహాయపడుతుంది.

Leave a comment