Categories
చూసేందుకు ఎర్రగా అందంగా కనిపించే స్ట్రా బెర్రీలు ఆరోగ్యానికి అందానికీ మేలు చేస్తాయి. వీటిలోని యాసిడ్స్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ లు చర్మం పై మృత కణాలు తొలిగించటం తో పాటు మొటిమలు రావటాన్ని నివారిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి తినటం వల్ల చర్మానికి ఆల్ట్రావయేలెట్ కిరణాల నుంచి కూడా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ సి చర్మానికి బిగుతుగా ఉండే కొలా జెన్ ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ,పోషకాలు లెప్టిన్ అనే హార్మోన్ ను ఎక్కువగా స్రవించేలా చేస్తాయి. ఈ హార్మోన్ లు కొవ్వును కరిగిస్తాయి. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గించే స్ట్రాబెర్రీలు తినాలి.