పసుపు పచ్చని గుమ్మడి పువ్వులలో అంతులేని ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు  ఆయుర్వేద వైద్యులు. ఎన్నో ప్రాంతాల్లో వీటిని వంటల్లో ఉపయోగిస్తారు.ఈ పువ్వుల వాడకం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.ఈ పువ్వులు ఎముకలకు బలం ఇచ్చే కాల్షియం ఫాస్ఫరస్ తగినంత మొత్తంలో ఉండటం వల్ల ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. పువ్వుల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఈ పూలను దగ్గు జలుబు వైరల్ జ్వరాలకు మందుగా ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ఈ కాలంలోనే ఈ గుమ్మడి తీగ మొగ్గ తొడిగి పుష్పిస్తుంది.

Leave a comment