Categories
ఆవు నెయ్యి చాలా మంచిదంటారు. ఒక స్పూన్ ఆవు నెయ్యిని ఆహారంతో తీసుకుంటే, అలాగే పదార్థాల తయారీలో ఆవు నెయ్యి వాడుతూ ఉంటే శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గడం మొదలుపెడుతుంది. గ్లాస్ పాలల్లో ఒక చెంచాడు ఆవు నెయ్యి పటిక బెల్లం పొడి కలిపి తాగితే శరీరం శక్తిని పుంజుకొంటుంది, కొలెస్ట్రాలు తగ్గుతోంది. పెసరు పప్పు కిచిడీలో నెయ్యి కలిపి తింటే శరీరంలోని విషతుల్యాలు బయటికి పోతాయి. ఆవు నెయ్యిలో కొవ్వును కరిగించే ఆమ్లం తయారు చేయగల గుణం ఉంది. హార్మోన్లని సమతుల్యంగా ఉంచగలుగుతోంది. ఎముకలు పుష్టిగా ఎదుగుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.