‘అ! సినిమాలో రెజీనా కాసాండ్రా లుక్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ సినిమాలోని బ్యాక్ లుక్ గురించి రెజీనా మాట్లాడుతూ వైవిధ్యమైన హేర్ స్టయిల్ ,చేతులపైనా గ్యాప్ లేకుండా ట్యాటూలతో సినిమాలో నటించాలని ముందే చెప్పారు. షూటింగ్ కు ముందు రోజే ఈ మేకప్ మొదలైంది.  హేర్ స్టయిల్ పూర్తి చేసి ,జుట్టు కట్ చేసి డైమండ్ షేపులు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతి వేళ్ళ వరకు ట్యాటూ డిజైన్ కోసం 24గంటలు పట్టింది. సాయంత్రం నాలుగు గంటలకు మొదలు పెడితే రెండో రోజు సాయంత్రానికి పూర్తైంది ఇదంతా.  మధ్యలో రెండు గంటలు నిద్ర పోయాను. ఈ లుక్ తో మొదటి షెడ్యూల్లో నాలుగు రోజులు షూట్ చేశారు. అలా మొత్తం మూడు షెడ్యూల్ లో పూర్తయ్యయి.  షూటింగ్ లు అయ్యేదాకా స్నానం లేదు. స్పాంజ్ బాల్ అంత కష్ట పడ్డాను ఆ పాత్ర కోసం అంటోంది రెజీనా. కష్టానికి తగిన ఫలితం దోరికితే బావుండు.

Leave a comment