ఆమె ఒక భారీ కామెడీ క్వీన్. పొట్టిగా లావుగా వుండే యూఈమె పేరు భార్తీ సింగ్. ఈమెతో సల్మాన్ ఖాన్ ,ప్రభు దేవా స్టెప్పు లేస్తారు. మాధురీ దీక్షిత్ ,కరీనా కపూర్ లు యూఆర్ గ్రేట్ అనేసారు. ఈమె మన దేశపు ఏకైక సెలబ్రెటీ మహిళా కమెడియన్. పంజాబ్ లోని అమృతసర్ కు చెందిన భార్తీ స్టార్ వన్ లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో ‘ తో వెలుగులోకి వచ్చింది. భార్తీ తన మిమిక్రీ తో జోకులతో యువత టీవీ ప్రేక్షకులను నవ్వించింది. ఇండియా (హౌస్ ) గాట్ టాలెంట్ భార్తీ సింగ్ కు పేరు తెస్తే కామెడీ సర్కస్ మరింత పాప్యులర్ చేసింది. ‘ఝలక్ దిల్ లాఓ ‘ డాన్స్ షోలో సన్నగా మెరుపు. తీగల్లా ఉన్న అమ్మాయిలతో సమానంగా డాన్స్ చేసి అందరి దృష్టి ఆకర్షించింది. సినిమాల్లో కామెడీ కన్నా ఈమె చేసే లైవ్ కామెడీలు చాలా కష్టం. దీనికెంతో తెలివితేటలు స్పాంటేనియస్ గా మాట్లాడటం సమయానికి తగ్గట్లు మాట్లాడటం ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా జోకులు పేల్చటం. అదొక పెద్ద ఆర్ట్ ఇప్పుడు భార్తీ బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.
Categories