వయస్సు దాటిన యూత్ ఫుల్ గా కనిపించాలంటే బాలెన్స్ డ్ జీవిత విధానం అవసరం అంటుంది శిల్పాశెట్టి .వయసు 46 ఏళ్లు ఇప్పటికీ ఆమె చేస్తున్న యోగ వీడియోలు చూస్తే ఆమెకు అంత వయసు ఉందా అనిపిస్తుంది .ముఖం కాంతివంతంగా ముడుతలు పడకుండా ఉండాలి అనుకుంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి అంటుంది శిల్పా .తనకు కావలసిన కాయగూరలు స్వయంగా పెంచుతుంది కూడా .ఆమెతో పాటు ఆమె కొడుకు వియాన్ కూడా ఆమె పెరటి తోటలో పని చేస్తాడు కూడా .తన తోటలో తను పండించిన ఫ్రూట్స్,వెజిటేబుల్స్ చూస్తుంటే ఇదే నా జీవితం లో హ్యాపీ మూమెంట్స్ అంటుంది శిల్పా. స్వయంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, విత్తనాలు, గింజలు తీసుకోవడం వల్లనే తన చర్మం అందంగా ఉంది అంటుంది శిల్పా .ఆమె చెప్పే సౌందర్య రహస్యాలు  ప్రకృతి సంబంధించినవే పచ్చని చెట్ల మధ్య రోజుకో గంట విశ్రాంతిగా తిరగటం కనీసం ఓ గంట వ్యాయామం చేయటం,ఏడుగంటల పాటు నిద్ర పోవటం ఇవేనా సౌందర్యానికి కారణం. ఆమె చెబుతున్న ప్రకారం 40 ఏళ్లు దాటిన వారు రెగ్యులర్ గా యోగా వాకింగ్ ప్రాణాయామం ఎక్సర్ సైజ్ లు చేస్తే ఖచ్చితంగా శరీరంలో మార్పు వచ్చేస్తుంది వీటితో పాటు మంచి ఆహారం తీసుకోవాలి ఎమోషనల్ గా వుండాలి అంటే చక్కగా నిద్ర పోవాలి. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం కష్టం. శిల్పా శెట్టి యోగ వీడియోలు చూస్తే తప్పకుండా ఎవరికైనా యోగా చేయాలి అన్న ఇన్స్పిరేషన్ వచ్చి తీరుతుంది .

Leave a comment