ఒకే మామిడి చెట్టుకు 22 రకాల మామిడి పండ్లు పండించే ఉత్తమ రైతు గా గుర్తింపు పొందారు కాకా సాహెబ్ సావంత్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా లోని ఓ చిన్న గ్రామం అంట్రాల్ గ్రామానికి చెందిన సావంత్ ఓ ఆటోమొబైల్ కంపెనీ లో మెకానిక్ గా పని చేసేవారు. పూణే లో ఉద్యోగం చేసే సావంత్ కు వేరే ఊరు బదిలీ అయింది. ఏదో తెలియని ప్రాంతానికి వెళ్లే బదులు సొంత ఊరు వచ్చేసి ఉన్న 20 ఎకరాల పొలాలో మామిడి మొక్కలు నాటాడు. అలాగే నర్సరీ కూడా ప్రారంభించాడు. అలాగే మామిడి చెట్ల పైన ప్రయోగాలు మొదలు పెట్టాడు. అంటు కట్టే విధానం ద్వారా ఒక మామిడి చెట్టుకు 22 రకాల కాయలు కాసేలా చేశారు .బంగినపల్లి రకాలు అల్ఫోన్సో సోనా పరి, వన్ రాజ్, లాల్ బాగ్  నిరంజన్ ఇలా ఎన్నో రకాల కాయలు ఆ చెట్టుకు కాస్తాయి. ఈ చెట్టుకు కాసిన పండ్లు ఇప్పుడో వింత అతని నర్సరీ నీ ఈ మామిడి చెట్లను చూసేందుకు ఎంతో మంది వస్తూ ఉంటారు. ఈయన విషయాన్ని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఉరన్ పండిత్ బిరుదుతో సత్కరించింది. నర్సరీ కోసం తోట కోసం ప్రభుత్వ పథకాలు రాయితీలు ఉపయోగపడ్డాయని ప్రతి రైతు రాయితీల పట్ల పథకాల పట్ల అవగాహన పెంచుకోవాలి అంటాడు కాకా సాహెబ్ సావంత్ నమ్ముకున్న రైతుకు ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటుంది భూమి !

Leave a comment