మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం వైద్య శాస్త్రం అంగికరించినదే ఒత్తిడికి గురవ్వుతున్న అనవసరపు బెంగ ప్రదర్శించే వారికి రోగాలు త్వరగా సోకుతాయంటున్నారు. మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరంలో ఏర్పడే ప్రీరాడికల్స్ ప్రభావాన్ని నియంత్రించేహార్మోన్ లు ఉత్పత్తి అవ్వుతాయి. అందుకే మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరానికి బాహ్యంగా అంతర్గతంగానే కాదు మనస్సుకి ఎంతో మేలు కలుగుతుంది. మనసారా నవ్వే నవ్వు ప్రభావం మొత్తం 16 శరీర అంగ్ల పైన ప్రత్యక్ష ప్రభావం చుపుతుంది. ముఖ కండరాళ్ళు మొదలుకుని, ఊపిరి తిత్తులు, గుండె రక్త ప్రసరణ, ఇతర శరీర భాగాల కండరాళ్ళు , జీర్ణ వ్యవస్థ వంటివి నవ్వుతోనే మేలు పొందుతాయి. పదినిమిషాలు నవ్వితే శరీరంలో కండరాళ్ళ శక్తి వినియోగామవ్వుతుంది. అలా ఏడాది పాటు ప్రతి రోజు నవ్వితే ఐదు పండ్ల బరువు తగ్గుతారట. నవ్వటం అంటే అంతర్గత అవయువాల చేత జాగింగ్ చేయించటమని ఒక నిపుణుడి అభిప్రాయం. రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా అనారోగ్యంతో ఆస్పత్రుల్లో వున్న వారి చికిత్స్య లో భాగంగా నవ్వు ఉపయోగిస్తున్నారు. మనస్పూర్తిగా నవ్వితే మనుషుల మూడ్ మార్చేసే, భాదను తొలగించే ఎండార్ఫన్ విడుదలవ్వుతాయి.
Categories