టీ అంటే తేయాకు టీనే కాదు ఎన్నో రకాల హెర్బల్ టీలు వచ్చాయి. ఆరోగ్యాన్ని కాపాడే అశ్వగంధ టీ ఇప్పుడు ట్రెండ్.చిటికెడు అశ్వగంధ పొడి,రెండు తులసి ఆకులు కాసిన్ని నీళ్లు మరిగించి వీటిని వడకట్టి తేనె కలిపితే అశ్వగంధ టీ తయారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ టీ ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది. జలుబు శ్వాసకోశ సమస్యలను పోగొడుతుంది ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం ఈ టీ తో ఆందోళన, డిప్రెషన్ అదుపులోకి వస్తాయి.

Leave a comment