Categories
పసితనంలో చేసే స్నేహాలు భవిష్యత్ లో వాళ్ళ ఆరోగ్యానికి కారణం అవుతాయని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ నిపుణులు. ఐదేళ్ళు దాటిన దగ్గర నుంచి స్నేహం ఎంతో విలువైనదో అర్థం అవుతుంది. స్నేహితులతోనే ఎంతోసేపు గడపుతారు .వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడుకుంటారు. వాళ్ళు కౌమార దశకు వచ్చే వరకు ఈ స్నేహం ఇలాగే కొనసాగుతాయి. అటుతరువాత చదువు ,ఉద్యోగంతో దూరం అయినా, చిన్నప్పటి స్నేహబాంధవ్యం మనసులో పదిలంగా ఉంటుంది. అలా స్నేహితులతో మంచి రిలేషన్ ఉన్నావాళ్ళకి మనసులోని ప్రతి ఆలోచన షేర్ చేసే అలవాటు వస్తే బీపీలు, ఊబకాయం వంటివి రావటం ,స్ట్రెస్ ఉండదు కనుక అనారోగ్యాలు తక్కవే అంటున్నారు .