ఈ రోజుల్లో పిల్లలు కాసేపు ప్రశాంతంగా పచ్చని వాతవరణoలో ఆటలు ఆడుకోవడం, విశ్రాంతిగా వుండటం గురించి అసలు ఆలోచించడం కూడా దండగే. ఒక నిమిషం వాళ్ళకు తీరిక ఎప్పుడు ఇస్తున్నాం. కానీ నెదర్లాండ్ నేత్ర వైద్యులు ఏం చెబుతున్నారంటే ఆరుబయట ఆటలాడటం పచ్చని పరిసరాల్లో తిరగటం వల్ల చిన్నారుల కంటిచూపు మెరుగవుతుందనీ కనీసం 45 నిముషాలు ఆరుబయట గడపటం వల్ల పిల్లలకు తగినంతగా డి విటమిన్ లభిస్తుందని దీనివల్ల వారి ఎముకలు బలంగా ఉంటాయని చెపుతున్నారు. పాటశాలల్లో చదువుల ఒత్తిడి, ఇళ్ళలో స్మార్ట్ ఫోన్స్ అంటిపెట్టుకుని గడిపే పిల్లల్లో ఎన్నో దృష్టి లోపాలు తలెత్తుతున్నాయని ఇవే పరిస్థితులు కొనసాగితే వచ్చే ముప్పయి ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లల్లో సగం మందికి దృష్టిలోపం వుండే అవకాశం వుందని చెపుతున్నారు. పిల్లల్ని ఎండలో కాసేపు ఆడుకునేలా చూడండని చెపుతున్నారు.

Leave a comment