అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారత కోసం కృషి చేసే పలు రంగాలకు చెందిన సామాజిక వ్యాపార వేత్తలకు ప్రతి ఏడాది వరల్డ్ ఫెలోస్ పేరుతో ఎంపిక చేసి గౌరవిస్తుంది.ఈ ఏడాది 91 దేశాల నుంచి ఎంపిక చేయగా వారిలో మన దేశానికి చెందిన 16 మంది ఉన్నారు.వారిలో ఢిల్లీకి చెందిన నేహా ఉపాధ్యాయ కూడా ఒకరు.ఈమె 2014లో గుణ పేరుతో సంస్థ ప్రారంభించి గ్రామీణ మహిళా రైతులతో సేంద్రీయ ఆహారపదార్థాలు తయారు చేయించింది. వారి ఉపాధికి సాధికారతకు కృషి చేసింది. బ్రిటిష్ కౌన్సిల్ నేహాను ఫ్యూచర్ లీడర్ కనక్ట్ సోషల్ ఇంపాక్ట్ ఇండియా అవార్డులతో గౌరవించింది.