నా చదువంతా నా ప్రయోగమే నేను గణితాన్ని అర్థం చేసుకునేందుకు చేసిన ప్రయత్నం నా తపన కష్టమే నా చదువు ట్రిపుల్ ఐటీ నుంచి మ్యాథమెటిక్స్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి స్టూడెంట్ నేనే అంటుంది విద్య. ఎం.ఎస్.సి డిజిటల్ సొసైటీ కోర్స్ లో గోల్డ్ మెడలిస్ట్. పుట్టుక తోనే కంటి చూపు పోయిన విద్య విజన్ ఎంపవర్అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థిని విద్యార్థులకు మేథ్స్ సైన్స్ చదివేందుకు మెటీరియల్ తయారు చేస్తోంది. అంధులైన విద్యార్థులు అన్ని విధాలా చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారుచేయడం లక్ష్యం ఉంటుంది విద్య. కర్ణాటకలోని అంధ విద్యార్థులను, ప్రపంచంలోని అంధ విద్యార్థులతో విద్యాసంస్థలలో అనుసంధానం చేస్తోంది విద్య.

Leave a comment