జాతీయ స్థాయిలో నా గొంతు వినబడుతుంటే ఆనందమేసింది. ర్యాపర్ నోయిల్ రాసి,బాణీ కట్టిన దిస్ ఈజ్ మీ పాట నేర్చుకుని ఆ సాహిత్యాన్ని వేగంగా పలికేందుకు నాకు వారం రోజులు పట్టింది. సోషల్ మీడియాలో పాట పోస్ట్ చేస్తే 9 లక్షల మంది విన్నారు నువ్వే ర్యాప్ పాడావా అని విన్న వాళ్ళు షాక్ అవుతుంటే భలే ధైర్యం వచ్చింది అంటుంది వితికాశేరు. బాలనటిగా సినిమా రంగంలో అడుగుపెట్టి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకున్నాక అమెరికా వెళ్లాను గత ఏడాది మహిళా శక్తి ని తెలియజేసే సూపర్ విమెన్ ర్యాప్ కోసం నటిస్తే పెద్ద హిట్ అయింది.ఈ ఏడాది ఐ పి ఎల్ ప్రాజెక్ట్ లో తెలుగు ర్యాప్ పాడితే అదీ హిట్ అంటుంది వితికాశేరు.వేగం తో సంగీతమూ, సాహిత్యము పోటీపడటం ర్యాప్ ప్రత్యేకత. ప్రపంచ వ్యాప్తంగా యువతను ఆకట్టుకునే మ్యూజిక్ ట్రెండ్ ఇది. ఇప్పుడు వితికాశేరు దూసుకు వస్తుంది.

Leave a comment