ఈ ప్రపంచంలో సుందర నందన వనాలున్నాయి. కళ్ళు తిప్పుకోనివ్వని అందాల పుష్పాలు ఉన్నాయి కానీ బ్రిటన్ లోని నార్త్ అంబర్ లాండ్ లోని అన్విక్ కేసిల్ లో పెంచే తోటల్లో మాత్రం విషపూరితమైన పుష్ప జాతులుంటాయి. చూసేందుకు అద్భుతమైన రంగుల్లో కళ్ళను ఆకర్షించే కాయలు, పువ్వులు ముట్టుకొన్న వాసన చూసిన  ప్రాణాలు తీసే స్తాయి. ఈ తోటకు ఏర్పాటుచేసిన ప్రవేశ ద్వారం పైన ప్రమాద సంకేతాలున్నాయి. ఇవి చూడాలంటే సాధ్యమైనంత దూరంగా గైడ్ల సూచనల మేరకు సురక్షితంగా జాగ్రత్తలు తీసుకొని మరి చూడాలి ఈ ప్రాణాలు తీసే మొక్కలే మీ ప్రాణాలు కాపాడే ఔషధాలు అంటారు వాటిని పెంచే వాళ్ళు ఇక్కడ వందలాది విష మొక్కలున్నాయి.

Leave a comment