ఇప్పుడు సెలబ్రీటిల మధ్య ఫిట్ నెస్ సవాళ్ళు నడుస్తున్నాయి. సోనాక్షి సిన్హా ఈ సవాళ్ళ జోలికి పోలేదు. కాని తన ఫిట్ నెస్ కి సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోవటం మాత్రం మానుకోలేదు. మరీ సవాల్ తీసుకోరా అన్న ప్రశ్నకు నా వరకు నేను ఫిట్‌ గా ఉన్నాను. నిలకడగా చేసే వ్యాయామమే నా ఫిట్ నెస్ మంత్రం. నేను నా పరిధిలో నా శరీరానికి సరిపడే వ్యాయామమే చేస్తాను. అంతే కాని ఏదో అద్భుతం చేయాలని నా శరీరాన్ని కష్టపెట్టను. ముందుగా బేసిక్స్ తెలుసుకుంటాను. తర్వాత నెమ్మదిగా మొదలు పెడతాను.
నా శరీరాకృతి చక్కగా మెరుగవుతుంది. అంతే గానీ ఇతరులతో పోల్చుకోవటం నాకు ఇష్టం లేదంటుంది.

Leave a comment