పిల్లలున్న ఇంట్లో ఉదయం వేళ కాస్త హడావిడిగానే ఉంటుంది. తల్లులు తొందరపడ్డట్లు పిల్లలు చురుగ్గా ఉండదు హాయిగా నిద్రలోనే ఉంటాను.వాళ్ళని లేపడం తయారు చేయడం బ్రేక్ ఫాస్ట్ తినిపించడం తల్లులకు పెద్ద సమస్య. వంటగదిలో నుంచి పిల్లలు నిద్రపోతున్న చోటకి పరుగులు తీస్తూ వాళ్ళని కేకలు పెడుతూ లేవమంటుంటారు. వాళ్ళు కదలకపోతే అరుస్తూ తిడతారు. అయితే ఇలాంటి ధోరణిలో పిల్లలను లేవద్దంటారు మానసిక నిపుణులు.ప్రతిరోజు ప్రశాంతంగా మొదలయ్యే ఉదయాలు పిల్లలకు భయంతో కంగారుతో మొదలవుతాయి.ఇక దింతో పిల్లలు రోజంతా నిరాసక్తిగా డల్ గా గడిపేస్తారు. స్కూళ్ళో వాళ్ళు చురుగ్గా సంతోషంగా ఉండలేరు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అందుకే ఉదయంవేళ తల్లులు ఎంత తొందర పని ఉన్నా పిల్లలు గందరగోళపడేలా చేయవద్దని వాళ్ళని ప్రశాంతంగా నెమ్మదిగా నిద్రలేపమని చెపుతున్నారు.
Categories