నీహారికా,
ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకోవలసిన విషయం ఒకటి చెప్పనా! మనం సుఖంగా జీవించాలంటే ఎన్నో రకాలైన కోరికలను కోరుకోవడం, ఎన్నో కావాలని ఆశపడటం చివరకు అవి లభించకపోతే నిరాశ పడటం అందరికీ ఎదురయ్యే అనుభవం. అయితే సుఖంగా ఉండాలంటే మాత్రం నిరాశను అనుభవంలోకి తెచ్చుకోకుండా ఉండాలి. అసలు ముందుగా ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు, అవి తీరగలవా? మనం దేన్నీ ఆశిస్తున్నాం అది సాధ్యపదేడా అని ఆలోచిస్తే వరసగా సమాధానాలోస్తాయి.మనం కోరుకునేవి మన పరిధిలో వుంటేఅవి తీర్చుకోవడం అసాధ్యం కాదు. ఒక మాదిరి ఐక్యూ వున్నా స్టూడెంట్ కూడా ఫస్ట్ న పాసవ్వాలని అనుకుంటే అది అనుచితమైన కోరిక కాదు. కాస్త కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవచ్చు. ఉన్నట్లుండి కోటి రూపాయలు కావాలని కోరుకోవడం మాత్రం ఆశ అనరు అత్యాశ అంటారు. ఆశకు అత్యాశకు మధ్య తేడా వుంటుంది. ఆశపడితే ఆ కోరిక మన శక్తికి తగినదే అయితే తీరుతుంది. దురాశ పడితే మాత్రం నిరాశ తప్పదు. తర్వాత కుంగిపోవడం, మానసిక బాధ, అనారోగ్యం, ఆస్పత్రి పాలవడం ఇవన్నీ ఒక వరసలో జీవితంలోకి వచ్చి పడే ప్రమాదాలు. ఆశ అన్నది మనం ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఒక సదవకాశం. దాన్ని సక్రమంగా ఉపయోగించుకొంటే అభివృద్ధి పధంలోకి నడిచెళ్ళిపోవచ్చు. అత్యసపడితే మాత్రం అంతే సంగతులు.