తిరగలి లో విసిరి తేనే పిండి పప్పు, రవ్వ సమంగా వస్తాయి అంటారు పాతకాలపు బామ్మలు. అలనాటి రకాలు ఈ రోజుల్లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి వేదకాలం నుంచి వాడుకలో ఉన్నా విసుర్రాయి తో విసిరిన పిండిలో గింజల్లో ఉండే పోషకాలు అన్ని పదిలంగా ఉంటాయి మిషన్లలో పిండి వేస్తే ధాన్యపు పొట్టు లోనివీ లోపలిపొర లోని పోషకాలు దెబ్బతింటాయి. పైగా ఈ విసుర్రాయి తో విసిరితే తిప్పే వాళ్లకు భుజాలు, మెడ నొప్పులు రావు కాళ్లు చేతుల పైన ఒత్తిడి పడకుండా పొట్ట పైన పడి, పొట్ట నరాలు తేలికగా ఉంటాయంటారు పెద్దవాళ్ళు అందుకే మళ్లీ తిరుగుళ్ళు ఇళ్ళల్లో తిరగటం మొదలు పెట్టాయి.

Leave a comment