Categories
దుస్తుల స్టైల్ కాస్త మారిస్తే సన్నగా నాజుకుగా కనిపిస్తారు అంటారు స్టైలిస్టులు.వదులుగా, మరీ బిగుతుగా లేకుండా సరైన ఫిట్టింగ్ తో ఉన్న డ్రస్లేసుకోవాలి. మరీ బిగుతైన బ్రాలు ,టైట్ గా ఉండే బ్లౌజ్ లతో కండలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. అలాగే స్కిన్నీ జీన్స్ వేసుకొని పాయింటెడ్ హాల్స్ షూస్ వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కనిపించాలంటే డ్రెస్ డిజైన్ తో కూడా ప్రత్యేకత ఉండాలి. మరీ పెద్ద డిజైన్ లు కాకుండా సన్నని చుక్కల్లాంటివే నాజుగా బావుంటాయి. స్టైల్ గా కనిపించాలంటే కేవలం దుస్తులే కాదు , ముందు బాడీ లాంగ్వేజ్ లో అంటే నడక ,మాట నిలబడే తీరులోనే అసలైన నాజుకుతనం హుందాతనం ఉంటుంది.