మేని ఛాయలోనే అందం ఉందని మీ పిల్లలకు చెప్పకండి లేదా వాళ్ళ ముందు మాటలతో ప్రకటించకండి.రంగు ముఖ్యం కాదని అంద చందాలు ముఖ కవళికల్లో ఉంటాయని అన్నింటికంటే చదువు సంస్కారం అఛీవ్ మెంట్స్ చాలా ముఖ్యమని చెప్పాలంటున్నారు అద్యాయన కారులు. పిల్లలకు బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం ప్రధానం అని తెలిసేలా చిన్నప్పటి నుంచీ చెప్పాలి. శరీరపు రంగు గురించి మాట్లాడటం తెలివితక్కువ ,అసలు రంగు ఒక గుణానికి ప్రతీక కాదు అని చెప్పాలంటున్నారు .పెయింటింగ్‌లో చదువుతో నైపుణ్యం వాళ్ళని ఎంతో ఎత్తుకు నిలబెడుతోందని చదువుతో పాటు ఎక్స్ ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ లో నిమగ్నమైతే వాళ్ళెంతో అఛీవ్ చేయగరని భోధించాలంటున్నారు. చదువు ,కళల ద్వారా వాళ్ళు ఒక ప్రత్యేకత సాధించగలరని వాళ్ళని అర్థంచేసుకోనివ్వాలి. కాస్త ఛాయ తక్కువ ఉన్న పిల్లలకు అ విషయాలు చెపుతూ వాళ్ళను ఆత్మ న్యున్యతకు గురి కాకుండా కాపాడమంటున్నారు.
Categories