Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2019/10/maxresdefault-4.jpg)
అట్లతద్ది ఆరట్లోయ్…..
ముద్దపప్పు మూడట్లోయ్…..
అమ్మాయిలు!! లేచారా? ఈ రోజు అట్లతద్ది కదా!! తెల్లవారు ఝామునే లేచి తలంటు స్నానం చేసి గోరింటాకు పెట్టుకుని గౌరమ్మను పూజించి, గోంగూర పచ్చడి,పెరుగు అన్నం కడుపు నిండుగా ఆరగించి తాంబూలం వేసుకుని ఊరంతా ఆడపిల్లలు ఊయలలూగుతుంటే చూడాలని ముచ్చటగా వుంటుంది.
ముత్తైదువులకు రవిక, గాజులు,నల్ల పూసలు,పసుపు- కుంకుమ,తాంబూలం వాయినం ఇచ్చుకుంటే గౌరమ్మను పూజించినట్టు.కన్నెపిల్లలకు గోరింటాకు,తాంబూలం ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడు.ఆడవాళ్ళు నీళ్ళలో ఎక్కువ సమయం వుంటారు కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చరిత్ర చెబుతోంది.
నిత్య ప్రసాదం:గోంగూర పచ్చడి,పెరుగు అన్నం,అట్లు.
-తోలేటి వెంకట శిరీష