వేసవి వస్తే మల్లె పూల జడలు పెళ్ళి కూతుర్లకు మొగళి పూల జడలు కాలం వెళ్ళిపోయి రెడిమేడ్ బంగారు జడల కాలం వచ్చింది. పొందికగా చక్కగా జడ కుప్పెలతో పాటు నెమళ్ళు పూల నగిషీలతో మామిడి పిందెల అందం కలుపుకుని పచ్చలు,కెంపులు,ముత్యాలు అద్దుకుని బంగారు జడలు వచ్చేశాయి. బంగారం,వజ్రలతోనే కాదు వన్ గ్రామ్ గోల్డ్,గోల్డ్ ప్లేటెడ్ జడలు కూడా వచ్చాయి. పొడుగ్గా సవరం పెట్టి అల్లిన జడకు పై నుంచి పిన్నుతో తగిలించే జడ బిళ్ళల జడలు రాళ్ళు,వజ్రాలు,ముత్యాలు అలంకరణతో చాంద్ బాలీ జడ ,రకరకాల జడ కుచ్చుల్ని జత చేసి బంగారు చామంతులు కూర్చిన వట్టి బంగారపు జడలు వచ్చాయి. ఈ రెడిమెడ్ బంగారు జడలు సౌకర్యం అందం కనుక అమ్మాయిల ఫేవరెట్స్ అయ్యాయి.

Leave a comment