చలి, ఎండలో ఈ రెండు సీజన్లకు కాటన్ లనే ఎంచుకుంటారు. అందులో సుతి మెత్తగా వంటికి హాయిగా చక్కని రంగులతో స్టయిల్ గా  వుండే లినెన్ చీరలు ఎంతో హుందాగా ఉంటాయి కూడా. నాజూగ్గా ,ఫ్యాషన్ గా  ఉంటే లినెన్ చీరలు దాదాపు సాదా గానే ఉంటాయి. ఇలాంటి సింపుల్ సారీస్ కట్టుకునప్పుడు లేదా లినెన్ కాటన్ డ్రస్ లు వేసుకున్నప్పుడు వీటిమీదకి సాంప్రదాయ బంగారు నగలు ఏమాత్రం బావుండవు. టెర్రకోట ,పూసలు, థ్రెడ్ తో చేసిన హ్యాండ్ మేడ్ ఆభరణాలు లినెన్ చేరాలకు సరిగ్గా సరిపోతాయి. బ్యాగ్ ,చెప్పులు కూడా లెథర్ లేదా హ్యాండ్ మేడ్ వి అయితేనే అలంకరణ డిఫరెంట్ గా ఉంటుంది. లినెన్ వస్త్ర శ్రేణి పైకి అసలు ఏ ఆభరణాలు లేకపోయినా అన్ని తరాలు  వారికీ ఆకట్టుకునేలాగా కనిపిస్తాయి. అసలా చెరలోనే ఉంటుంది అందం అంతా.

Leave a comment