ఫ్యాషన్ అంటే ఏదైనా ఫ్యాషన్ గానే ఉండాలి. చివరకు చెప్పులైనా ఏ డిజైన్ అయినా చూపులను కట్టిపడేసేలా ఉండాలి. ఫంకీగా ఉండాలి. చెప్పులు సౌకర్యం కోసం కాకుండా ఫ్యాషన్ సిగ్మెంట్స్ లా వస్తున్నాయి. మడమ నొప్పి లాగేస్తున్న హై హీల్స్ కే  ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఇప్పుడు ఫ్లాట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడా ఫ్లాట్స్ లో ఎన్నెనో వెరైటీ డిజైన్లున్నాయి. అచ్ఛం పువ్వులే పాదాల పైకి తీర్చి దిద్దినట్లు ఫ్లవర్ డిజైన్లు పాదం ముందు భాగం నుంచి మడమ కు చుట్టేస్తూ యాంకిల్ స్ట్రాప్స్ పైన పువ్వుల డిజైన్లు మెరిసే రాళ్లు ,రంగుల ఈకలు మెరుపులున్న అందమైన బట్టలు అమర్చినవి గ్లాడియేటర్  తరహా లో పాదాల  అలంకరణ లతో ఆభరణాలు ఉన్నట్లు ఎన్నో వెరైటీస్. ఈ ఫ్లాట్ సాండల్స్ వచ్చాయి. ఇది చుడీదార్లు ,చీరలు, వేటి మీదకైనా బావుంటాయి. ఇంత హంగామా వద్దనుకుంటే ఫ్లాట్ సాండల్స్ తో కేవలం స్ట్రాప్స్ టోన్ చక్కగా డిజైన్లున్నాయి. ఒకవైపు ఫ్యాషన్ సౌకర్యం ఉన్న ఈ ఫ్లాట్ సాండల్స్ ఇప్పుడు హాట్ ఫ్యాషన్

Leave a comment