రత్నాల సబ్బులు వాడేరా ? వీటినే జెమ్ స్టోన్ రాక్ సోప్స్  లేదా రాక్ సోప్స్  అంటారు. ఇవి అచ్ఛంగా ఎదో ఒక రత్నం లాగానో రాయి లాగానో ఉంటాయి. సాధారణ సబ్బులకన్నా గాఢత తక్కువగా ఉంది నురగ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకం సబ్బులను మట్టి సారంతో పాటు కలబంద క్యామోమైల్ ,లావెండర్ విటమిన్ ఇ ,బాదాం నూనె ,జొజోబా నూనె వనమూలికల సారం కొన్ని రకాల పరిమళాలు కలిపి చేస్తారు. ఈ రాక్ సోప్స్  వజ్రాలు మొదలుకుని పుష్పరాగం ,గోమేధికం ,పగడం ,పచ్చ, కెంపు,నీలం లాంటి సాంప్రదాయ రత్నాలు టర్కోయిస్ క్వాటీ ఐ  లాంటి ఫ్యాషన్ బుల్ ఉపరత్నాల దాకా  అన్ని రకాల రాళ్లుగా కనిపించేలా వీటిని తయారు చేస్తారు. సాండ్ స్టోన్ మార్బుల్ లాంటి ఇతర తరహా రాళ్ళూ లాంటి సోంపులూ ,గ్లిజరిన్ లో తయారై వివిధ రంగుల్లో పారదర్శకంగా వుండే ఇవి నీటిలో తడిసినప్పుడు మెరుస్తూ చూసేందుకు చాలా  బావుంటాయి.సాధారణ సబ్బుల్లా ఒక ప్రత్యేకమైన ఆకారంలో కాకుండా అచ్ఛం వజ్రాలు రాళ్లను కత్తి రించినట్లే ఉంటాయి. మంచి సువాసన వచ్చే ఈ సోప్స్  ఖరీదు పెద్ద ఆకాశం అంటేలా ఏం లేవు. ఇష్టమైతే మనం కూడా ఆన్ లైన్లో ఆర్డరిచ్చి  తెపించుకోవచ్చు.

Leave a comment