Categories
విమాలు,రైళ్ళు,బస్సులు,ఆటోలు ఇవన్నీ ఆడవాళ్ళు అలవోకగా నడిపించేస్తున్నారు. చెన్నైకి చెందిన రేష్మా నీలోఫర్ సాగర్ ,ఐలాండ్ నుంచి కోల్ కతా ఫోర్ట్ కి నౌకల్ని నడుపుతూ ఫస్ట్ ఉమెన్ రివర్ ఫైలట్ గా రికార్డ్ సృష్టించింది. చెన్నైలో జన్మించిన రేష్మా నాటికల్ సైన్సెస్ లో బీఎస్సీ చేసి కోల్ కతా ఫోర్ట్ ట్రస్ట్ లో శిక్షణ తీసుకుంది. సముద్ర గర్భం నుంచి కోల్ కతా ఫోర్ట్ కి ప్రతి రోజు సామాన్లు చేరవేస్తారు. ఆమె ప్రయాణించే దూరం 223 కిలోమీటర్లు .హుగ్లీ మీదుగా ప్రయాణించే దూరం 148 కిలో మీటర్లు అనేక మలుపులు, అడ్డంకులతో నిండి ఉంటుంది. ఎంతో సాహాసంతో సముద్రం నుంచి ఫోర్టుకి ఓడల్నీ నడిపే రేష్మా కొత్త చరిత్ర సృష్టించింది.