Categories
తెలంగాణలోని నారాయణపేట మహిళలు తయారు చేసిన ఆయుర్వేద మాస్క్ లు ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.పుదీనా, లవంగం, తులసి, కర్పూరం, వాముతో సంజీవ ధార మిశ్రమాన్ని తయారుచేస్తారు వీటి తో మాస్క్ లను మంచి ఆరబెడతారు.వీటిని వారం వరకు ఉపయోగించవచ్చు శ్వాస పీల్చినప్పుడు ఆయుర్వేద ఔషధ గుణాలతో ఉండే వాసన లోపలికి వెళుతుంది. నాణ్యమైన కాటన్, పోచంపల్లి, నారాయణపేట వస్త్రాలతో వివిధ రకాల డిజైన్ లతో ఈ మాస్క్ లను తయారు చేస్తున్నారు.హైదరాబాద్ లోనే లక్ష యాభై వేలకి పైగా మాస్క్ లు అమ్ముడయ్యాయి.సంజీవ ధార తో వస్తున్న ఈ ఆయుర్వేద మాస్క్ లను నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన స్వయంగా పర్యవేక్షిస్తున్నరు.