పుట్టిన పాపాయికి పాలు సరిపోకపోతే బాలింటలు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవలంటున్నారు డాక్టర్లు.మెంతుల్లో మాంసకృత్తులో సీ విటమిన్ నియాసిన్ పొటాషియం ఉంటాయి. ఇవి పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. నేరుగా నానబెట్టి అయినా దేన్లో కలిపి అయినా తినవచ్చు.ఓట్స్ కూర బాలింతలు తీసుకోవలిసిన ఆహరమో వీటిలో బీటా గ్లూ కోన్స్ మాంసకృత్తులు పీచు,పిండి పదార్ధాలు ఉంటాయి. ఓట్స్ లో శరీరానికి కాల్షియం,ఇనుము అందుతాయి.వెల్లుల్లి పాల వృద్దికి చాలా మంచిది. వెల్లుల్లి వాసనకు తినలేకపోతే అవి మాత్రాల రూపంలో కూడా దొరుకుతాయి. బొప్పాయి, క్యారెట్ ,పాలకూర,సొరకాయ ,బీర కాయ వంటివి కూడా తప్పనిసరిగా తినాలి.

Leave a comment